Salman Khan Katrina Kaif Starrer Tiger 3 Movie Released Date Out: బాలీవుడ్ కండల వీరుడు, భాయిజాన్ సల్మాన్ ఖాన్ మోస్ట్ అవేయిటెడ్ మూవీలో 'టైగర్ 3' ఒకటి. 'ఎక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' చిత్రాలతో కత్రీనా కైఫ్, సల్మాన్ బెస్ట్ ఆన్‌స్క్రీన్ జోడీగా గుర్తింపు పొందింది. ఈ మూవీ సిరీస్‌లో వీరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. అందుకే సల్లూ భాయి ఫ్యాన్స్ వీరి కలయికలో మరో మూవీ ఎప్పుడూ వస్తుందా అని ఎదురూ చూస్తుంటారు. 'టైగర్ 3' మూవీ ఖరారు అయ్యాక.. ఇక సినిమా రిలీజ్ ఎప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'టైగర్ 3' చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్.
ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్ షేర్ చేశాడు. ఈ వీడియోలో కత్రీనా కైఫ్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్‌ను ప్రాక్టీస్ చేస్తూ సూపర్ హాట్‌గా కనులవిందు చేసింది. తన ప్రాక్టీస్ తర్వాత సల్మాన్‌ను 'ఇక నీ టర్న్' అని చెప్పగా.. 'టైగర్ ఎప్పుడూ సిద్ధమే' అని సల్మాన్ జవాబిస్తాడు. ఈ వీడియో, సల్మాన్ సమాధానం 'టైగర్ 3' సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఇక ఈ మూవీ వచ్చే సంవత్సరం అంటే 2023లో ఈద్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఈ వీడియోలో తెలిపారు.
Salman Khan Katrina Kaif Tiger 3 Movie: 'టైగర్' ఎప్పుడూ సిద్ధమే.. వచ్చేది ఆ పండుగ రోజే
Published Fri, Mar 4 2022 4:11 PM | Last Updated on Fri, Mar 4 2022 5:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment