సల్మాన్‌ భాయ్‌కు థ్యాంక్స్‌: కొరియోగ్రాఫర్‌ భార్య | Remo DSouza Wife Thanks Salman Khan For Emotional Support | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ భాయ్‌కు థ్యాంక్స్‌: కొరియోగ్రాఫర్‌ భార్య

Published Fri, Dec 25 2020 4:12 PM | Last Updated on Fri, Dec 25 2020 4:12 PM

Remo DSouza Wife Thanks Salman Khan For Emotional Support - Sakshi

ఇటీవలే గుండెపోటుకు గురైన ప్రముఖ కొరియోగ్రాఫర్‌, 'ఏబీసీడీ' దర్శకుడు రెమో డిసౌజ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే రెమో గుండెపోటుకు గురైన సమయంలో అతడి భార్య లిజెల్‌ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ ఆమెకు బాసటగా నిలబడి, మానసిక స్థైర్యాన్ని నింపారట. ఈ విషయాన్ని లిజెల్‌ సోషల్‌ మీడియాలో తెలుపుతూ కష్టకాలంలో తనకు కొండంత అండనిచ్చిన సల్మాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన భర్తను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను షేర్‌ చేశారు. (చదవండి: ఇంతకూ ధనశ్రీ ఎవరో తెలుసా!)

పట్టలేనంత సంతోషంగా ఉంది
"నాకు దక్కిన బెస్ట్‌ క్రిస్‌మస్‌ గిఫ్ట్‌ ఇదే. నా భర్త మళ్లీ కోలుకోవడం సంతోషంగా ఉంది. వారం రోజులుగా అత్యంత దారుణమైన క్షణాలను గడిపిన తర్వాత ఆయన్ను హత్తుకోవడం ఎంతో బాగుంది. రెమో ఆస్పత్రిలో ఉన్న సమయంలో నాకు మానసిక ధైర్యాన్ని నూరిపోసిన సల్మాన్‌ భాయ్‌కు హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఒక దేవదూతలాగా ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటున్నందుకు థ్యాంక్యూ సో మచ్‌. రెమో కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రెమో ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చినందుకు నాకు పట్టలేనంత ఆనందంగా ఉంది. ఛలో ఇప్పుడు మనం క్రిస్‌మస్‌ పండగ సంబరాలను మొదలు పెడదాం" అని ఆమె రాసుకొచ్చారు.

కాగా సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన 'రేస్‌ 3' చిత్రానికి రెమో దర్శకత్వం వహించారు.  అలాగే 'ఏబీసీడీ (ఎనీ బడీ కెన్‌ డాన్స్‌)', 'ఏబీసీడీ 2', 'ఎ ఫ్ల‌యింగ్ జాట్' సినిమాల‌కు డైరెక్షన్‌ చేశారు. 'బాజీరావ్ మ‌స్తానీ' చిత్రంలోని దీవానీ మ‌స్తానీ పాట‌కుగాను అత‌డు 63వ నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ కొరియోగ్ర‌ఫీ అవార్డును సొంతం చేసుకున్నారు. డ్యాన్స్ ప్ల‌స్‌, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌, ఝ‌ల‌క్ దిఖ్లా జాలాంటి రియాల్టీ షోల‌లో జడ్జిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. (చదవండి: ప్రముఖ కొరియోగ్రాఫ‌ర్‌కు గుండెపోటు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement