
'తదుపరి జేమ్స్‌బాండ్ సల్మాన్ ఖాన్'
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ‘హిట్ అండ్ రన్’ కేసులో బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చడం పట్ల సోషల్ మీడియాలో ట్విట్టర్‌లో వ్యంగోక్తులు వెల్లువెత్తాయి. ‘తదుపరి జేమ్స్‌బాండ్‌గా సల్మాన్ ఖాన్‌నే తీసుకోవాలి, లెసైన్స్ టు కిల్.... 2002లో ప్రపంచంలోనే సల్మాన్ ఖాన్ డ్రైవర్‌లెస్ కారు నడిపారు... చివరకు తేలింది ఏమిటంటే మద్యం తాగింది కారని... ఇక నన్ను చంపింది సల్మాన్ కాదు. నేనే ఆత్మహత్య చేసుకున్నానంటూ కృష్ణ జింక సూసైడ్ నోట్ కూడా దొరకుతుంది... సల్మాన్ ఖాన్ అమాయకుడు.
చేతన్ భగత్ గొప్ప రచయిత....మైనే ప్యార్ కియాలో నటించి ఉంటే బాగుండేదని ఆరుషి పేరంట్స్ భావిస్తుండవచ్చు...2002 చంపేసి తప్పించుకునే సంవత్సరం....ఆ రోజు సల్మాన్ ఖాన్ దానంతట అదే నడిచే అద్భుత టార్జాన్ కారులో ప్రయాణించారు....గూగుల్‌కు ఆలోచన రాకముందే డ్రైవర్‌లెస్ కారులో సల్మాన్ వెళ్లారు....తప్పు సల్మాన్ ఖాన్‌ది కాదు, దరిద్రానిది...సోనియా, రాహుల్ గాంధీలు సల్మాన్ న్యాయవాదులను పెట్టుకోవాలి. అసలు హెరాల్డ్ కేసనేది లేదని నిరూపిస్తారు’ ఇలా రకరకాలు వ్యంగ్య ట్వీట్లు హోరెత్తుతున్నాయి.
#SalmanVerdict @BeingSalmanKhan Salman was innocent, car was drunk. Footpath assaulted car. Jail term to footpath. Wah legal system ....
— Natesh R. Nathan (@Natesh_Nathan) December 10, 2015
In other news a Black Buck which was found dead under mysterious circumstances in 1998 had committed suicide:Forensic Report. #SalmanVerdict
— Bobins V. Abraham (@BeingJournalist) December 10, 2015