సాక్షి, హైదరాబాద్: ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ పాదరక్షల తయారీ సంస్థ ‘వాకరూ’ వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రముఖ బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్‌తో ఆరు రకాల ప్రచార చిత్రాలను రూపొందించింది. ఆమిర్‌ఖాన్ ఈ ప్రచార చిత్రాలలో ఆరు భిన్న పాత్రలతో కనిపించి వినియోగదారులకు బ్రాండ్‌పట్ల ఆసక్తిని పెంచనున్నారు. సరసమైన ధరలతో, నాణ్యతతో ఆధునిక వినియోగదారులను ఆకర్షించేలా వాకరో తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేస్తోంది.
ఈ సందర్భంగా వాకరూ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీకేసీ నౌషాద్ మాట్లాడుతూ, ఆమిర్‌ఖాన్‌తో ప్రచారం ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఎప్పటికప్పుడు మా కంపెనీ వినియోగదారుల సౌకర్యంపై దృష్టిపెట్టడంతో పాటు, అధునాతన మోడళ్లని ప్రవేశపెడుతోందని చెప్పారు. నేటితరం స్టైల్‌తోపా టు నాణ్యతకు కూడా ప్రాధాన్యతనిస్తోందని, వాకరూ కొత్తతరం వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులపై దృష్టి సారిస్తుందని హవాస్ గ్రూప్ ఇండియా చైర్మన్, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ బాబీ పవార్ పేర్కొన్నారు.
ప్రచార చిత్రాలు సైతం వారు సంతృప్తి చెందేలా రూపొందించామని, టీవీలలో, సామాజిక మాధ్యమాలలో ఈ చిత్రాలను విస్తృతంగా ప్ర సారం చేయనున్నామని ఆయన చెప్పారు. పాదరక్షలతో నూతన పోకడలను పరిచయం చేసేలా 2012లో ‘వాకరూ’ను ప్రారంభించారు. అన్ని వ యసుల వారిని ఆకర్షించేలా ఈ కంపెనీ పాదరక్షలు రూపొందిస్తోంది. 2020–21లో వాకరూ రూ. 1,200 కోట్లకు పైగా టర్నోవర్ సాధించడం విశేష
Comments
Please login to add a commentAdd a comment