'ధూమ్-3' కలెక్షన్ల సునామీ | Dhoom3 Highest Ever In The History Of Bollywood | Sakshi
Sakshi News home page

'ధూమ్-3' కలెక్షన్ల సునామీ

Published Mon, Dec 23 2013 7:55 PM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

'ధూమ్-3' కలెక్షన్ల సునామీ

'ధూమ్-3' కలెక్షన్ల సునామీ

అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు నటించిన ధూమ్-3 చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 20వ తేదీన విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.36 కోట్లు వసూలు చేసింది. తర్వాతి రోజు కూడా భారీగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ చిత్రం సరికొత్త రికార్డు దిశగా దూసుకుపోతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమిళం, తెలుగులలో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల మోత మోగిస్తోంది. దేశం మొత్తమ్మీద చూస్తే.. తొలి మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటి రూ. 107 కోట్లను వసూలు చేసింది.  దీంతో చెన్నై ఎక్స్ ప్రెస్ తొలి వారంలో వసూలు చేసిన 100.35 కోట్ల రికార్డుకు బ్రేక్ పడింది.
 

ఈ చిత్ర కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా కూడా  భారీగా వసూలవుతున్నాయి. దీంతో ఓ సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసే బాటలో ధూమ్-3 పయనిస్తోంది.. ప్రస్తుతం ముందున్నది పండుగ సీజన్ కావడంతో ఈ సినిమా మరిన్ని కలెక్షన్లును వసూలు చేసి చరిత్ర సృష్టిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement