dhoom3
-
చైనాలో ధూమ్3 సంచలనం!
ముంబై: బాలీవుడ్ లో ధూమ్౩ చిత్రం సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లను సొంతం చేసుకున్న చిత్రాల్లో ధూమ్ చిత్రం ఒకటిగా నిలిచింది. తాజాగా చైనాలో 2 వేల స్క్రీన్లలో విడుదలైన ధూమ్ 3 అక్కడి టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింవది. ఇప్పటికే టర్కి దేశంలో ధూమ్3 చిత్రం టాప్ టెన్ జాబితాలో 9వ స్థానం సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. చైనాలో టాప్ 10 చిత్రాల్లో ధూమ్3 చిత్రం 9వ స్థానాన్ని సొంతం చేసుకుంది. చైనాలో 1.35 మిలియన్ డాలర్లను వసూలు చేసిందని యష్ రాజ్ ఫిల్మ్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. చైనాలో భాషలో విడుదలైన రొమాంటిక్ చిత్రం 'నో జూ నో డై' అనే చిత్రాన్ని కలెక్షన్ల పరంగా వెనక్కినెట్టినట్టు సమాచారం. -
ధూమ్3 టీమ్‌తో చిట్ చాట్
-
'ధూమ్-3' కలెక్షన్ల సునామీ
అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రాలు నటించిన ధూమ్-3 చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 20వ తేదీన విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.36 కోట్లు వసూలు చేసింది. తర్వాతి రోజు కూడా భారీగా కలెక్షన్లు వసూలు చేసిన ఈ చిత్రం సరికొత్త రికార్డు దిశగా దూసుకుపోతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమిళం, తెలుగులలో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల మోత మోగిస్తోంది. దేశం మొత్తమ్మీద చూస్తే.. తొలి మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటి రూ. 107 కోట్లను వసూలు చేసింది. దీంతో చెన్నై ఎక్స్ ప్రెస్ తొలి వారంలో వసూలు చేసిన 100.35 కోట్ల రికార్డుకు బ్రేక్ పడింది. ఈ చిత్ర కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా వసూలవుతున్నాయి. దీంతో ఓ సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసే బాటలో ధూమ్-3 పయనిస్తోంది.. ప్రస్తుతం ముందున్నది పండుగ సీజన్ కావడంతో ఈ సినిమా మరిన్ని కలెక్షన్లును వసూలు చేసి చరిత్ర సృష్టిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మళ్లీ విలన్‌గా నటిస్తా!
బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్‌కి మిస్టర్ పర్ఫెక్ట్ అని బ్రాండ్ నేమ్ ఉంది. ఏ పాత్ర చేసినా దానికి పూర్తి న్యాయం చేస్తారాయన. నో బౌండరీస్... నో లిమిటేషన్స్. అంత పెద్ద సూపర్‌స్టార్ అయ్యుండి కూడా విలన్‌గా చేయడమంటే మాటలు కాదు. ‘ధూమ్-3’ కోసం భారతీయ సినీ ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారంటే దానికి కారణం... అందులో ఆమిర్ విలన్‌గా నటించడమే. ఆమిర్ స్ఫూర్తితో షారుక్‌ఖాన్ కూడా విలన్‌గా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా షారుక్‌ఖాన్ మాట్లాడుతూ -‘‘ఆమిర్ గొప్ప నటుడు. ‘ధూమ్-3’లో పాత్ర కోసం తన దేహాన్ని మార్చుకున్న తీరు, కష్టపడిన విధానం నాకు స్ఫూర్తినిస్తోంది. విలన్ పాత్ర కోసం ఆమిర్ పడిన తపన అభినందనీయం. కేవలం శారీరక, మానసిక అంశాలే కాకుండా ఆమిర్ చిత్రాలను ఎంచుకునే తీరు, ప్రవర్తన నాకెంతో ఇష్టం’’ అని అన్నారు. ఆమిర్ అందించిన స్ఫూర్తితో మళ్లీ విలన్‌గా నటించాలనిపిస్తోందని షారుక్ తెలిపారు. ‘‘నా కెరీర్ ఆరంభంలో డర్, బాజీగర్, అంజామ్ చిత్రాల్లో విలన్‌గా నటించాను. చాలా కాలంగా అలాంటి పాత్రలు చేయలేదు. ఎవరైనా ఆఫర్ చేస్తే వంద కోట్లు వస్తాయా, రెండు వందల కోట్లు వసూలు చేస్తాయా అనే విషయాన్ని బేరీజు వేయకుండా మళ్లీ విలన్ పాత్రను పోషించాలనుకుంటున్నాను’’ అని షారుక్ తెలిపారు.