బాలీవుడ్ స్టార్లు...వ్యాపారవేత్తలు... రాజకీయనాయకులు... భారత క్రికెటర్లు... ఇలా అనేక మంది ప్రముఖులతో సచిన్ టెండూల్కర్ పార్టీ కళకళలాడింది. తన సన్నిహితుల కోసం సచిన్ సోమవారం రాత్రి ఒక ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశాడు.
నలుపు రంగు సూట్‌లో సచిన్, అదే రంగు డ్రెస్ ధరించిన అంజలి స్వయంగా అతిథులను ఆహ్వానించారు. బాలీవుడ్‌నుంచి అమితాబ్, ఆమిర్ ఖాన్, రాహుల్ బోస్, కరణ్ జొహర్ దీనికి హాజరయ్యారు. క్రికెటర్లు గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్ కూడా వచ్చారు. ప్రస్తుతం ఆడుతున్న ధోని, కోహ్లితో పాటు యువ క్రికెటర్లు పార్టీలో సందడి చేశారు.