బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ నటించిన తొలి సినిమా 'మహరాజ్'. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే ఇందులో కీలకమైన పాత్రలో నటించింది. సుమారుగా మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రాకు చెందిన వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్మెంట్ తెరకెక్కించింది. అయితే, ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో బ్రిటీష్ కాలంలో భక్తి పేరుతో జరిగిన అన్యాయాలను ప్రశ్నించే జర్నలిస్ట్ పాత్రలో జునైద్ ఖాన్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని గంటల్లో మహరాజ్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ దేశవ్యాప్తంగా ట్విటర్ వారు జరుగుతుంది. ఈ చిత్రంలో హిందూవుల మనోభావాలను చులకన చేస్తూ పోస్టర్స్ ఉన్నాయిని నెటిజన్లు మండిపడుతున్నారు. హిందూ మత పెద్దలతో పాటు సన్యాసులను నెగెటివ్ కోణంలో చూపించనున్నారని సమాచారం. గతంలో అమీర్ ఖాన్ పీకే సినిమాలో కూడా శివుడిపై జోకులు వేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు జునైద్ కూడా హిందూ మతాన్ని కించపరిచేలా సినిమా తీశాడని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థను ఇండియాలో బ్యాన్ చేయాలంటూ నెట్టింట చాలామంది డిమాండ్ చేస్తున్నారు. #BoycottNetflix అనే ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతుంది. వారసులమని చెప్పుకుని తిరిగే వారి సినిమాలు చూడొద్దంటూ సోషల్ మీడియాలో చాలా మంది కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment