సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. సంపాదించిన సాయి పల్లవి ఇప్పుడు హిందీలో ఆరంగేట్రం చేయనున్నారు. తన నటనతో పాటు అద్భుతమైన డ్యాన్స్‌తో విశేష క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగుతోంది.
(ఇదీ చదవండి: Harsha Sai: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మతలుగా సీఎం బంధువుతో పాటు బిగ్‌బాస్ బ్యూటీ)
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ త్వరలోనే తెరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన నటిస్తున్న తొలి చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇది పూర్తికాకముందే జునైద్ హీరోగా మరో చిత్రం ఖరారైందని, అందులో హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేశారంటూ వార్తలొస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది అని కూడా వార్తలు రాస్తున్నారు. దీనికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు అని, ఇది ఒక ప్రేమ కథా చిత్రం అని కూడా అంటున్నారు. బాలీవుడ్‌లో పలు సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ పనిచేశాడు.
ఈ మేరకు లాస్ ఏంజిల్స్‌లోని ఓ డ్రామా స్కూల్‌లో కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాడు. తన తండ్రి నటించిన ‘పీకే’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే అతను ఇప్పుడు హీరోగా తెరపై కనిపించనున్నాడు. తన తండ్రి పేరు చెప్పకుండా మొదటి సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా సుమారు 20 సార్లు తిరస్కరణకు గురి అయిన తర్వాత సినిమా అవకాశం దక్కించుకున్నాడు.
నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలిసిందే. అందం కాదు అభినయమే ఆమెకు ముఖ్యం. ఎప్పుడూ పాజిటివ్‌గా స్మైల్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ. వెండితెరపై తన పాత్రలకు ప్రాణం పోస్తుంది. అయితే గత కొద్దిరోజులుగా స్క్రీన్‌పై తక్కువుగా కనిపిస్తున్న ఆమె. చివరగా 2022లో విరాట్ పర్వం, గార్గి చిత్రాలతో మెరిసింది. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ఓ సినిమా చేస్తోంది. తాజాగా ఆమె ఈ బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment