మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బరోజ్’. ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 25న పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుదల కానుంది.
బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్‌లాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా చాలా ఆసక్తిగా ఉంది. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నాడు. వాస్కోడిగామాకి చెందిన అపార సంపద (బంగారం,వజ్రాలు) బరోజ్ అనే ఒక భూతం 400 ఏళ్ళగా కాపాడుతూ వస్తుంది. ఆయనకు సంబంధించిన నిజమైన వారసులకు ఆ సంపదని అప్పగించాలని ఆ భూతం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తో సినిమా ఉండనుంది.
తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మించారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న తెలుగు,హిందీ,తమిల్,కన్నడ,మలయాళంలో బరోజ్ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment