
సాక్షి, చెన్నై: జీవీ ప్రకాష్‌కుమార్ సంగీత దర్శకుడిగా.. నటుడిగా బిజీగా ఉంటూనే ప్రైవేట్ ఆల్బమ్ చేస్తూ సంగీత ప్రియులను అలరిస్తున్నారు. తాజాగా మైక్‌సెట్ శ్రీరామ్ నటించిన ‘వాడీ ఎన్ చెల్లకుట్టి’ అనే పల్లవితో సాగే పాటను పాడారు. అరుళ్‌రాజ్ సంగీతాన్ని అందించారు. మైక్‌సెట్ శ్రీరామ్ పాటను రాసి జననీ దుర్గతో కలిసి ఈ వీడియో ఆల్బంలో నటించారు.
అజార్ నృత్య దర్శకత్వం వహించిన దీనిని విల్వా దర్శకత్వంలో మైక్‌సెట్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుళ్‌రాజ్ రూపొందించారు. శుక్రవారం చెన్నైలోని పీవీఆర్ థియేటర్‌లో ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. పీవీఆర్ సౌత్ హెడ్ సాబ్రియా, నటుడు ఆర్జే విఘ్నేష్ కాంత్, కదీర్, ఫ్రాంక్ స్టార్ రాహుల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment