
తెరవెనుక ఆయనే దసరా బుల్లోడు!
‘‘తెరపై దసరా బుల్లోడు ఏయన్నార్ అయితే... తెరవెనుక దసరా బుల్లోడు వీబీ రాజేంద్రప్రసాద్‌గారు. ఆయనతో నాది మూడున్నర దశాబ్దాల అనుబంధం. ఆయన గురించి కుటుంబ సభ్యుల కంటే నాకే ఎక్కువ తెలుసు. 2004లో తొలిసారి విడుదల చేసిన ‘దసరాబుల్లోడు’ పుస్తకానికి కొనసాగింపుగా ఈ పుస్తకాన్ని అందిస్తున్నా’’ అన్నారు సీనియర్ జర్నలిస్ట్ భగీరథ. దర్శక–నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ జీవిత కథ ఆధారంగా వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భగీరథ రాసిన ‘దసరాబుల్లోడు’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘చిత్రసీమకు విశిష్ట సేవలు అందించిన రాజేంద్రప్రసాద్ చివరి దశలో చేసిన కృషి వల్లే ఫిలింనగర్ దైవసన్నిధానంలో 18 దేవాలయాలున్నాయి. దర్శక, నిర్మాతలకు ఈ పుస్తకం ఆదర్శనీయ గ్రం«థంగా నిలవాలి’’ అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అతిథిగా హాజరయ్యారు. వీబీ రాజేంద్రప్రసాద్ తనయుడు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.