
పల్లెకు పోయి.. పారుని చూసి...
నట జీవితాన్ని వారసత్వంగా ఇచ్చిన దిగ్గజాల జ్ఞాపకాలను తమతో పాటే ఉంచుకోవాలని అనుకుంటు న్నారు వారసులు. ఆ లెజెండరీ నటుల సినిమా సీక్వెల్స్‌లో నటించడం, వాళ్లు నటించిన అలనాటి క్లాసిక్ సాంగ్స్‌ని రీమిక్స్ చేయడం ఇవన్నీ... అలాంటి ఆలోచనల్లో భాగమే.
ఇప్పుడు అక్కినేని కుటుంబ కథానాయకుడు సుశాంత్ కూడా తాత ఏయన్నార్ పాటలో ఆడిపాడాడు. ‘దేవదాసు’ సినిమాలోని ‘పల్లెకు పోదాం... పారును చూద్దాం ఛలో ఛలో..’ అనే ఎవర్ గ్రీన్ సాంగ్‌కి స్టెప్పులేశారు సుశాంత్.
ఆయన హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల నిర్మిస్తున్న ‘ఆటాడుకుందాం రా’ కోసమే ఈ పాటను రీమిక్స్ చేశారు. ‘‘తాతగారి ‘దేవదాసు’ సినిమా పాట రీమిక్స్‌లో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ పాట చిత్రీకరిస్తున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను’’ అని సుశాంత్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.