అక్కినేని డ్యూయెట్స్ 50
విజిల్ వేయండి.. పజిల్ విప్పండి
అక్కినేని నాగేశ్వరరావు మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య నటుడు. ముఖ్యంగా గృహిణులు ఏఎన్‌ఆర్ సినిమా కోసం ఎదురు చూసేవారు. దానికి తగ్గట్టే ఏఎన్‌ఆర్ సినిమాల కథాంశాలుండేవి. సావిత్రి, జమున ఆ తర్వాతి కాలంలో వాణిశ్రీ అక్కినేనికి సరిజోడుగా నటించి మెప్పు పొందారు. ఆయన సినిమాల్లో అందమైన యుగళ గీతాలుండేవి. అలాంటి 100 యుగళగీతాలను తలుచుకుందాం. అక్కినేని వల్ల మన జీవితంలో వచ్చిన ఆనందగీతాలను ఆస్వాదిద్దాం. ఈ తొలి పది పాటల్లో సైకిల్ మీద వెళుతూ బి.సరోజాదేవితో పాడే పాట ఏదో గుర్తుపట్టండి. అలాగే తర్వాతి రోజుల్లో కమెడియన్‌గా మారిన గిరిజతో ఎంతో మంచి డ్యూయెట్టు ఉంది. అది ఏది?
1. ఓ దేవదా చదువు ఇదేనా (దేవదాసు)
2. రాజశేఖరా నీపై మోజు తీర లేదురా (అనార్కలి)
3. చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా (దొంగరాముడు)
4. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము (మాయాబజార్)
5. చెట్టులెక్కగలవా ఓ నరహరి (చెంచులక్ష్మి)
6. ఆకాశ వీధిలో అందాల జాబిలి (మాంగల్యబలం)
7. నేడు శ్రీవారికి మేమంటే పరాకా (ఇల్లరికం)
8. వాడుక మరచెదవేల (పెళ్లికానుక)
9. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి (వెలుగు నీడలు)
10. మధురం మధురం ఈ సమయం (భార్యాభర్తలు)
అక్కినేనికి కవి దాశరథి తన గ్రంథాన్ని అంకితమిచ్చారు. అందుకు కృతజ్ఞతగా అక్కినేని ఆయనకు పాటలు రాసే అవకాశం ఇచ్చాడు. దిగువ ఉన్న పది పాటల్లో దాశరథి రాసినవి ఉన్నాయి.. గుర్తు పట్టండి. అలాగే తెలుగు సినిమాల్లో తొలి వాన పాట కూడా ఉంది. బెంగళూరులో పాట ఏం రాయాలో తోచక కారులో తిరుగుతున్న ఆత్రేయకు అప్పుడే మొదలైన వాన ఆ పాటను రాయించి నేటికీ మనం తడిసేలా చేస్తోంది.
11. పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక (ఇద్దరు మిత్రులు)
12. నన్ను వదిలి నీవు పోలేవులే (మంచి మనసులు)
13. ప్రేమయాత్రలకు బృందావనము (గుండమ్మ కథ)
14. వినిపించని రాగాలే కనిపించని అందాలే (చదువుకున్న అమ్మాయిలు)
15. చిటపట చినుకులు పడుతూ ఉంటే (ఆత్మబలం)
16. నా పాట నీ నోట పలకాల సిలక (మూగమనసులు)
17. నిలువుమా నిలువుమా నీలవేణి (అమరశిల్పి జక్కన)
18. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా (డాక్టర్ చక్రవర్తి)
19. కనులు కనులతో కలబడితే (సుమంగళి)
20. పగడాల జాబిలి చూడు (మూగనోము)
21. కన్నులు నీవే కావాలి (సుమంగళి)
22. నువ్వంటే నాకెందుకో అంత ఇది (అంతస్తులు)
23. అది ఒక ఇదిలే అతనికి తగులే (ప్రేమించి చూడు)
24. సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా (మనుషులు మమతలు)
25. ఒక పూలబాణం తగిలింది మదిలో (ఆత్మగౌరవం)
26. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి (పూలరంగడు)
27. విన్నవించుకోనా చిన్న కోరిక (బంగారు గాజులు)
28. విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియ (బందిపోటు దొంగలు)
29. ఓ చామంతి ఏమిటే ఈ వింత (ఆత్మీయులు)
30. కళ్లలో పెళ్లిపందిరి కనపడసాగే (ఆత్మీయులు)
‘దసరా బుల్లోడు’తో అక్కినేని కలర్ పాటలు. స్టెప్పులు చూసే వీలు ప్రేక్షకులకు కలిగింది. ఘంటసాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఆయన స్థానంలో వి.రామకృష్ణను వినేందుకు కూడా సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పాటల్లో లక్ష్మితో మంచి డ్యూయెట్ ఉంది. చూడండి.
31. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా (దసరా బుల్లోడు)
32. నీ కోసం వెలసింది ప్రేమమందిరం (ప్రేమ్ నగర్)
33. ఆకులు పోకలు ఇవ్వొద్దు (భార్యాబిడ్డలు)
34. మనసులు మురిసే సమయమిది (ప్రేమలు పెళ్లిళ్లు)
35. వయసే ఒక పూలతోట (విచిత్ర బంధం)
36. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది (బంగారు బాబు)
37. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా (బంగారు కలలు)
38. జాబిల్లి చూసేను నిన్ను నన్ను (మహాకవి క్షేత్రయ్య)
39. ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని భావాలో (మహాత్ముడు)
40. మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు (సెక్రటరీ)
1980ల తర్వాత పూర్తిగా అక్కినేని కొత్తతరం హీరోయిన్లతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గళంలో హుషారు పాటలతో కొనసాగారు. జయసుధ, జయప్రద, శ్రీదేవి, సుజాత వీరంతా ఎక్కువగా ఆయన పక్కన నటించారు. అక్కినేని హీరోగా రిటైర్ అయ్యే వరకు ఎన్నో హిట్లు ఉన్నా ఒక పది పాటలు చెప్పుకుందాం. ఈ లిస్ట్‌లోని చివరిపాటను మోహన్‌లాల్‌తో డ్యూయెట్‌గా అభినయించారు అక్కినేని. ఆ సినిమా సంగీత దర్శకుడు ఎవరు?
41. నేల మీది జాబిలి నింగిలోన సిరిమల్లి (రాజా రమేష్)
42. నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని (ప్రేమాభిషేకం)
43. ఒక లైలా కోసం తిరిగాను దేశం
(రాముడు కాదు కృష్ణుడు)
44. మల్లెపూలు గొల్లుమన్నవి (అనుబంధం)
45. మధురం జీవన సంగీతం (వసంత గీతం)
46. చందమామ దిగి వచ్చే లోన (జస్టిస్ చక్రవర్తి)
47. ఇది మేఘ సందేశమో (ఏడంతస్తుల మేడ)
48. ఈ కోవెల నీకై వెలిసింది ఈ వాకిలి నీకై తెరిచింది (అండమాన్ అమ్మాయి)
49. తామరపువ్వంటి తమ్ముడు కావాలా (బంగారు కానుక)
50. గోరువంక వాలగానే గోకులానికి (గాండీవం)
– కూర్పు : కె
Comments
Please login to add a commentAdd a comment