ఆ సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యా: కమల్ | 'Manam' made me emotional: Kamal Haasan | Sakshi
Sakshi News home page

ఆ సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యా: కమల్

Published Thu, May 29 2014 11:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM

ఆ సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యా: కమల్

ఆ సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యా: కమల్

అక్కినేని కుటుంబంలో ఉన్న నటులంతా కలిసి చేసిన 'మనం' సినిమా.. తనను తీవ్ర భావోద్వేగానికి గురిచేసిందని ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ అన్నారు. ఒక ప్రైవేటు స్క్రీనింగ్లో ఆయన ఈ సినిమా చూశారు. ఈ సినిమా దివంగత అక్కినేని నాగేశ్వరరావుకు మంచి నివాళి అవుతుందని చెబుతూ, సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

తాను చిన్నప్పటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు అభిమానినని, ఈ సినిమా మళ్లీ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసిందని కమల్ తెలిపారు. వెండితెరమీద ఏఎన్నార్ను చూడగానే ఒక్కసారిగా ఉద్వేగం ఆపుకోలేకపోయినట్లు చెప్పారు. ఆయనకు ఈ రకంగా నివాళులు అర్పించిన అక్కినేని కుటుంబానికి హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement