
నాన్నా.. వి మిస్ యు..
ఏడుదశాబ్ధాల నట జీవితం.. ఎన్నో పాత్రలు.. మరెన్నో అవార్డులు.. తెలుగు సినీచరిత్రతోపాటూ తానూ సమాంతరంగా ఎదిగి ఒదిగిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 92వ జయంతి నేడు. ఈ సందర్భంగా నటుడు నాగార్జున తండ్రిని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.
'నాన్నా..విష్ యు హ్యాపీ బర్త్ డే. ఎక్కడున్నా సరే నీ ఆశీస్సులు ఎల్లవేళలా మా వెంటే ఉంటాయని తెలుసు. నిజంగా ఈ రోజు మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. ' అంటూ భావోద్వేగాన్ని పంచుకున్నారు నాగార్జున. 250కి పైగా సినిమాల్లో నటించి, మెప్పించిన ఏఎన్నార్ గత ఏడాది జనవరిలో కన్నుమూయడం తెలిసిందే. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసిన ఆయన.. భారతీయ సినీరంగం ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డునూ పొందారు.
#ANRLivesON wishing you NANA happy birthday where ever you are/we know your blessings will be with us always.we will miss you this evening.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 20, 2015