తెల్ల రైనో సూడాన్ చిత్రం
జుబూ : అది ఓ ఖడ్గ మృగం... దాన్ని చుట్టూ జడ్ ప్లస్ కేటగిరి స్థాయిలో భద్రత. 24 గంటలూ కమాండోలు దానికి కాపలా కాస్తుంటారు. ఇది సాధారణ రైనో కాదు. కానీ, ఈ భూమ్మీద మిగిలిన ఒక్కగానోక్క మగ తెల్ల ఖడ్గ మృగం అది. దాని పేరే సూడాన్. ప్రస్తుతం అది చివరి క్షణాలకు చేరుకోగా.. అధికారుల్లో కంగారు నెలకొంది.
వేటగాళ్ల నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మూడేళ్ల నుంచి సూడాన్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. ప్రపంచంలో అంతరించి పోతున్న జంతువులలో తెల్ల ఖడ్గ మృగాలు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా మిగిలినవి 3 మాత్రమే. అందులో సూడాన్ ఒకటి కాగా.. మిగిలిన రెండూ ఆడవి. సంతానోత్పత్తి కోసం ఈ మూడింటిని ఒకే చోట చేర్చారు. అయితే సూడాన్ అనారోగ్యంతో అధికారుల్లో కంగారు మొదలైంది. దానికి ఏమైనా అయ్యిందో ఇక తెల్ల ఖడ్గమృగాల వంశం అంతరించినట్లేనని భయపడుతున్నారు. గతేడాది డేటింగ్ యాప్‌లో విరాళాల సేకరణ ద్వారా దీని పేరు మారు మోగిపోయింది.
సాధారణంగా వీటి జీవిత కాలం 50 సంవత్సరాలు. ఇప్పుడు దీని వయస్సు 46 ఏళ్లు. గతేడాది దాని కాలుకి ఇన్‌ఫెక్షన్ సోకింది. అది నయమవుతున్న సమయంలో మరో కాలికి సోకింది. చికిత్స అందిస్తున్న ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, ఏదైనా అద్భుతం జరిగి అది త్వరగా కోలుకోవాలని సంరక్షకులు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు అది చనిపోక ముందే సంతానోత్పత్తి చేసే సాధ్యాసాధ్యాలపై శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment