అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు కలిగిన విశాఖపట్నం విమానాశ్రయంలో భద్రతా వ్యవస్థ మూడు నెలలుగా పడకేసింది. విమానాశ్రయంలో సీసీ కెమెరాల ఫుటేజీ మూడు నెలలుగా లేదని స్వయంగా విశాఖ పోలీసులే హైకోర్టుకు నివేదించడం గమనార్హం. కీలకమైన ఎయిర్‌పోర్టులో నెలల తరబడి సీసీ కెమెరాలు ఆఫ్‌లో ఉన్నాయని పోలీసులు చెప్పడం అందరినీ విస్మయపరుస్తోంది. దొంగతనాలు, ఇతర నేరాల కట్టడికి అపార్టుమెంట్లు, చిన్న వ్యాపార సంస్థల్లో కూడా సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పోలీసులు తరచూ చెబుతుంటారు. అలాంటిది దేశ, విదేశ ప్రముఖులు, వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ముఖ్యమైన విమానాశ్రయంలో సీసీ కెమెరాలు కచ్చితంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలనే ధ్యాసే లేకపోవడం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కావాలనే సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని, కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కుట్రలో భాగంగానే కెమెరాలు ఆఫ్..
Published Wed, Nov 14 2018 7:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement