
చోరీ యత్నానికి ప్రయత్నించిన ఏటీఎం
కృష్ణాజిల్లా, ఎర్రబాలెం(మంగళగిరి): మండలంలోని ఎర్రబాలెంలో మంగళవారం తెల్లవారుజామున ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని బండివారి వీధి సెంటర్‌లో ప్రధాన రహదారి వెంట ఉన్న ఇండి క్యాష్ ఏటీఎం నగదు చోరీ చేయడానికి దుండగులు విఫలయత్నం చేశారు.
తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి చొరబడి సీసీ కెమెరాలను పగులకొట్టారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఏటీఎంలో నగదు తీసుకునేందుకు వచ్చిన ఖాతాదారులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.