
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న అంబులెన్స్ ఇబ్రహీంపట్నం కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో 67 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయలయ్యాయి. వివరాలు.. కరోనా రోగులను తీసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరిన అంబులెన్స్ ఈరోజు(శుక్రవారం) తెల్లవారు జామున సత్యనారాయణపురం వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఘటన స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా పాడేరుకు చెందిన గ్రంధి రంగ నాయకుడుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment