దొంగలను పట్టించిన సీసీ టీవీ | Cc which had thieves TV | Sakshi
Sakshi News home page

దొంగలను పట్టించిన సీసీ టీవీ

Published Tue, Dec 16 2014 1:57 AM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM

దొంగలను పట్టించిన  సీసీ టీవీ - Sakshi

దొంగలను పట్టించిన సీసీ టీవీ

దొడ్డబళ్లాపురం : ఇక్కడి సినిమా రోడ్డులో ఉన్న వర్ధమాన్ జువెలర్స్ దుకాణంలో గత శుక్రవారం యజమాని కళ్లుగప్పి చాకచక్యంగా లోపల జొరబడి సుమారు ఒకటిన్నర కేజీ బంగారం చోరీ చేసిన ఖతర్నాక్ మహిళా దొంగలు నలుగురు ఆ దుకాణంలో చోరీకి ముందు సమీపంలోని పలు దుకాణాల్లో చోరీకి ప్రయత్నించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగు చూసాయి.  పట్టణ పరిధిలోని   కొంగాడియప్ప రోడ్డులో ఉన్న పలు నగల దుకాణాలకు కస్టమర్ల రూపంలో వచ్చిన మహిళా దొంగలు నలుగురూ దుకాణం నిర్వాహకుల కళ్లుగప్పి నగలు చోరీకి తీవ్రంగా ప్రయత్నించారు.

కుదరకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వర్ధమాన్ జువెల్లర్స్‌లో చోరీ జరిగాక అనుమానం వచ్చిన దుకాణాల వారు తమ సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా మహిళలు చోరీకి ప్రయత్నించిన దృశ్యాలు వెలుగుచూసాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా దుకాణాల నుంచి ఫుటేజీలను తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫుటేజీలలో ఖతర్నాక్ దొంగల ముఖాలు మరింత స్పష్టంగా కనిపించడంతో దొంగలు పట్టుబడే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దొంగతనం చేయడంతో వారు చూపిన నేర్పరితనం, తెగింపు చూస్తే వారు గతంలో పలు చోరీలు చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement