Women robbers
-
చూశారో.. దోచారే
సాక్షి, హైదరాబాద్: జనసమర్థమున్న ప్రాంతాల్లో బంగారం ధరించిన వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకొని దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ సీసీఎస్ పోలీసులు, అమన్‌గల్ పోలీసులతో కలిసి సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన దాడుల్లో శ్రీమలి చెల్లె నర్సమ్మ, వేముల సమ్మక్క, బండారి అనితలను అరెస్టు చేసి రూ.2,56,00 విలువైన 8 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా కథనం ప్రకారం...రాజేంద్రనగర్‌కు చెందిన నర్సమ్మ బెల్ట్‌షాప్ నిర్వహిస్తోంది. బొరబండకు చెందిన వేముల సమ్మక్క, ఫతేనగర్‌కు చెందిన భండారి అనిత ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. గతంలో వీరిపై రాజేంద్రనగర్, మియాపూర్, పేట్‌బషీరాబాద్, సనత్ నగర్, జవహర్‌నగర్, కుషాయిగూడ, మేడిపల్లి, ఘట్కేసర్, హుయామున్‌నగర్, లంగర్‌హౌస్, కుల్సుంపుర ఠాణాలతో పాటు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనూ కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల అమన్‌గల్, కందుకూరు, నిజామాబాద్ వన్ టౌన్‌లోనూ వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దీన్నినిని సవాల్‌గా స్వీకరించిన బాలానగర్ సీసీఎస్ పోలీసులు, అమన్‌గల్ పోలీసులతో కలిసి నిఘావేసి ఉంచారు. ఈ మేరకు వీరి ముగ్గురిని అమన్‌గల్‌లో మంగళవారం అరెస్టు చేశారు. ‘కల్లు దుకాణాలు, మార్కెట్ ప్రాంతాలకు వచ్చే వృద్ధ మహిళలను లక్ష్యంగా పెట్టుకునేవారు. ఈ ముగ్గురిలో ఒకరు బంగారు కాయిన్ దొరికిందని హడావుడి చేసేది. మరో మహిళ వచ్చి అది నిజంగానే బంగారు కడ్డీ అని నటించేది. అక్కడే ఉన్న బాధిత మహిళ ఇది నిజమని నమ్మి వచ్చి ఆ బంగారు కడ్డీలో తనకు వాటా ఇవ్వాలంటూ వాదనకు దిగేలా చేసేవారు. ఈ క్రమంలోనే బాధిత మహిళ తన మెడలో ఉన్నబంగారు ఆభరణాలను తీసి ఆ కడ్డీని తీసుకునేలా చూసి అక్కడి నుంచి పారిపోయేవార’ని పోలీసులు తెలిపారు. నర్సమ్మపై కుల్సుంపురఠాణాలో పీడీ యాక్ట్ ఉన్నట్లు తెలిపారు. -
నాలుగు నిమిషాల్లోనే ముగించారు
హైదరాబాద్: పార్క్ చేసి ఉన్న కారు బ్యాటరీ దొంగతనానికి గురైందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి ఆఫీసర్స్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. బాధితుడు ఆదివారం ఉదయం యధావిదిగా కారు తీస్తుండగా స్టార్ట్ అవ్వకపోవడంతో బ్యానేట్ ఓపెన్ ఉండటాన్ని గమనించాడు. దీంతో స్థానిక ఇంట్లో సీసీ ఫుటేజ్ గమనించగా చిత్తు కాగితాలు ఏరుకోవడానికి అటువైపు వచ్చిన ముగ్గురు మహిళలు కారు నుంచి బ్యాటరీ దొంగలించడం రికార్డ్ అయింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక సింగరేణి కాలనీలోని మహిళల పనిగా పోలీసులు గుర్తించారు. నాలుగు నిమిషాల వ్యవధిలో తమన పని పూర్తి చేసుకుని మహిళలు పరారయ్యారు. చిత్తు కాగితాలు ఏరుకునే మహిళల రూపంలో వారు సంచరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
దొంగలను పట్టించిన సీసీ టీవీ
దొడ్డబళ్లాపురం : ఇక్కడి సినిమా రోడ్డులో ఉన్న వర్ధమాన్ జువెలర్స్ దుకాణంలో గత శుక్రవారం యజమాని కళ్లుగప్పి చాకచక్యంగా లోపల జొరబడి సుమారు ఒకటిన్నర కేజీ బంగారం చోరీ చేసిన ఖతర్నాక్ మహిళా దొంగలు నలుగురు ఆ దుకాణంలో చోరీకి ముందు సమీపంలోని పలు దుకాణాల్లో చోరీకి ప్రయత్నించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగు చూసాయి. పట్టణ పరిధిలోని కొంగాడియప్ప రోడ్డులో ఉన్న పలు నగల దుకాణాలకు కస్టమర్ల రూపంలో వచ్చిన మహిళా దొంగలు నలుగురూ దుకాణం నిర్వాహకుల కళ్లుగప్పి నగలు చోరీకి తీవ్రంగా ప్రయత్నించారు. కుదరకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వర్ధమాన్ జువెల్లర్స్‌లో చోరీ జరిగాక అనుమానం వచ్చిన దుకాణాల వారు తమ సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా మహిళలు చోరీకి ప్రయత్నించిన దృశ్యాలు వెలుగుచూసాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా దుకాణాల నుంచి ఫుటేజీలను తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫుటేజీలలో ఖతర్నాక్ దొంగల ముఖాలు మరింత స్పష్టంగా కనిపించడంతో దొంగలు పట్టుబడే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దొంగతనం చేయడంతో వారు చూపిన నేర్పరితనం, తెగింపు చూస్తే వారు గతంలో పలు చోరీలు చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.