
నడుచుకుంటూ వెళ్తున్న బాధితులు
నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును దుండగులు తెంచుకెళ్లారు
రసూల్‌పురా: నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని పుస్తెలతాడును దుండగులు తెంచుకెళ్లారు. మంగళవారం కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పాతబోయిన్‌పల్లి అంజయ్యనగర్ నివాసి చంద్రకళ ఏడబ్ల్యూహెఓ కాలనీలోని ఓ ఇంట్లో పని చేస్తోంది. మంగళవారం ఉదయం 6.45 గంటల సమయంలో తన సోదరితో కలిసి గన్‌రాక్ ఫేజ్–2 నుంచి ఆ కాలనీకి నడుచుకుంటూ వెళ్తుండగా..
వెనుక నుంచి బైక్‌పై అతివేగం గా దూసుకొచ్చిన ఇద్దరు యువకులు సడన్ బ్రేక్ వేశారు. దీంతో ఆందోళనకు గురైన మహిళలు ఇద్దరూ రోడ్డుపై నిలిచిపోగా.. వెంటనే బైక్‌పై ఉన్న ఓ యువకుడు చంద్రకళ మెడలోని పుస్తెలతాడును బలంగా లాగాడు. తాడులోని తులం విలువ గల ఒక వరుస మాత్రమే దొంగ చేతిలోకి వెళ్లగా.. మిగిలిన సగం తాడు సూత్రాలతో పాటు కిందపడింది. బాధితురాలి సమాచారం మేర కు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, సమీపంలోని సీసీ కెమెరాల్లోని ఫుటేజీని సేకరించారు. దొంగలు యూనికార్న్ బైక్‌పై వచ్చి స్నాచింగ్‌కు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల్లోని చిత్రాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
స్నాచింగ్ చేసి బైక్‌పై పారిపోతున్న దొంగలు (సీసీ కెమెరా దృశ్యాలు)