చోరీ వద్దన్నందుకు కడతేర్చారు.. | Guardsman killed friends | Sakshi

చోరీ వద్దన్నందుకు కడతేర్చారు..

Dec 25 2013 12:36 AM | Updated on Sep 2 2017 1:55 AM

పంజగుట్టలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీ కాపలాదారుడు రాజరెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. అతడు పనిచేస్తున్న కళాశాలలోనే స్నేహితులు చోరీ చేయడానికి ఉపక్రమించగా అడ్డుకున్నందుకే హతమార్చారని తేలింది.

= కాపలాదారుడిని హతమార్చింది స్నేహితులే
 == కీలక ఆధారాల్ని ఇచ్చిన  సీసీ కెమెరా ఫుటేజ్
 = ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు

 
సాక్షి,సిటీబ్యూరో: పంజగుట్టలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీ కాపలాదారుడు రాజరెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. అతడు పనిచేస్తున్న కళాశాలలోనే స్నేహితులు చోరీ చేయడానికి ఉపక్రమించగా అడ్డుకున్నందుకే హతమార్చారని తేలింది. హత్యకు ఒడిగట్టిన ముగ్గురు నిందితుల్నీ మంగళవారం అరెస్టు చేశామని వెస్ట్‌జోన్ డీసీపీ వి.సత్యనారాయణ ప్రకటించారు. అదనపు డీసీ పీ నాగరాజు, పంజగుట్ట ఏసీపీ వెంకటనర్సయ్యలతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు.

ప్రైవేట్ కళాశాలలో కాపలాదారుడిగా పనిచేసిన రాజరెడ్డి, గతంలో ఇదే కాలేజీకి సెక్యూరి టీగార్డుగా పనిచేసిన అమీర్‌పేటలో నివసించే కర్నె కృష్ణ (ప్రింటింగ్ ప్రెస్‌కార్మికుడు), శ్రీనగర్‌కాలనీవాసి శ్రీనివాస్‌యాదవ్, పంజగుట్టకు చెందిన ఎం.యాదయ్యలు స్నేహితులు. వీరు ప్రతినిత్యం ఆ కళాశాల వద్దే కలుసుకునే వారు. అంతాకలిసి ఏదొక ప్రాంతంలో మద్యం సేవించేవారు. ఎవరి వద్ద నగదు ఉంటే ఆ రోజు కు వారు ఖర్చు పెట్టేవారు.

ఈనెల 15న సాయంత్రం కూడా ఈ నలుగురూ కాలే జీ ఎదుటున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద కలుసుకొని..శ్రీనివాస్‌యాదవ్ మద్యం తాగేందుకు రూ.50 ఇవ్వాల్సింది గా రాజరెడ్డిని కోరాడు. అతడు నిరాకరిం చడంతో ఘర్షణకు దిగి బలవంతంగా లా క్కున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వా దం  జరిగింది. రెచ్చిపోయిన శ్రీనివాస్ ‘నిన్ను చంపేస్తా’ అంటూ రాజరెడ్డిని హెచ్చరించాడు. రాజరెడ్డి కాలేజీలోకి వెళ్లిపోగా...మిగిలిన ముగ్గురూ కొంతసేపు గడిపారు.
 
ఇక్కడే పథకం పన్నారు..: కర్నె కృష్ణ గతంలో రాజరెడ్డి పనిచేస్తున్న కాలేజీలోనే సెక్యూరిటీగార్డుగా పనిచేయడంతో రెం డో అంతస్తులోని గదిలో నగదు ఉంటుందని గుర్తుకొచ్చింది. దీంతో విషయాన్ని మిగిలిన ఇద్దరికి చెప్పాడు. రాజరెడ్డిని ఫూటుగా మద్యం తాగించి ఆ తర్వాత చోరీ చేయాలనుకున్నారు. ఇలా నలుగురు కలిసి రెండో అంతస్తులోని గదిలోకి వెళ్లి తాగడం మొదలుపెట్టారు. రాజరెడ్డి మాత్రం కేవలం కొద్ది పరిమాణంలోనే తాగి తనకు వద్దనడంతో కథ అడ్డం తిరిగింది. అతడు నిద్రపోతాడని చాలాసేపు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో తమ పథకాన్ని బయటపెట్టారు.

తాను సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న కాలేజీలో చోరీ చేయొద్దని సూచించాడు. ఇది మింగుడుపడని శ్రీనివాస్ ఆగ్రహంతో రాజరెడ్డి మెడబిగించి అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేశాడు. మిగిలిన ఇద్దరు రైటింగ్‌ప్యాడ్‌తో రాజరెడ్డి తలపై మోదారు. రాజరెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న ముగ్గురూ గదిలో ఉన్న రూ.45,800 నగదు, ఇతర ఉపకరణాలు తీసుకొని ఉడాయించారు. హత్య నేపథ్యంలో రంగంలోకి దిగిన పంజగుట్ట సీఐ తిరుపతిరావు తన బృందంతో దర్యాప్తు ప్రారంభించారు.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పైనవున్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను అధ్యయనం చేశారు. ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసు లు, చూసిన కాలేజీ యాజమాన్యం తొలుత కర్నె కృష్ణను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతను మిగిలిన ఇద్దరి పేర్లు బయటపెట్టగా..శ్రీనివాస్,యాదయ్యల్ని పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement