V. Satyanarayana
-
బరాత్ డ్యాన్స్‌ల్లో మారణాయుధాలు వద్దు
చార్మినార్: ఫంక్షన్ హాళ్ల వద్ద అర్దరాత్రి వరకు బరాత్‌ల పేరుతో మారణాయుధాలు తిప్పుతూ ప్రమాదకర డ్యాన్స్‌లు చేయటం ఘర్షణలకు దారి తీస్తున్నాయని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఈ డ్యాన్స్‌లపై నిబంధన విధించినట్లు చెప్పారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శనివారం సాయంత్రం పురానీహవేలీలోని దక్షిణ మండలం డీసీపీ కార్యాలయ సమావేశ మందిరంలో పాతబస్తీలోని వివిధ ఫంక్షన్ హాల్స్ యజమానులు, నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని... హాళ్లను అద్దెకు తీసుకుంటున్న వారిని వారించలేకపోతున్నారన్నారు. పెద్ద ఎత్తున ఆర్కెస్ట్రా వినియోగించడం, బ్యాండ్ బాజాలతో పాటు డీజేలను అనుమతించడం తదితర కార్యక్రమాలతో ఆయా ప్రాంతాల ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దక్షిణ మండలం అదనపు డీసీపీ బాబురావు మాట్లాడుతూ... ఇప్పటికే కొంతమంది ఫంక్షన్ హాల్స్ నిర్వాహకుల వ్యవహార శైలిపై తాము నిఘా పెట్టామని, సరైన ఆధారాల దొరికితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పదే పదే చెబుతున్నా వినకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరు పహిల్వానో తేల్చుకునేందుకే ఫైట్
-
ఎవరు పహిల్వానో తేల్చుకునేందుకే ఫైట్
నబీల్ ఘటనపై దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ హైదరాబాద్: స్నేహితుల్లో ఎవరు పహిల్వానో తేల్చుకునేందుకే స్ట్రీట్‌ఫైట్ ఘటన చోటు చేసుకున్నట్లు దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ వెల్లడించారు. స్ట్రీట్‌ఫైట్‌లో నబీల్ మృతికి కారణమైన 9 మందిని అరెస్ట్ చేశామని, వీరిలో ఇద్దరు మైనర్లను జువైనల్‌కు పంపి మిగతా ఏడుగురిని రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. నిందితుల వద్ద నుంచి సెల్ఫోన్లు, 2 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గురువారం విలేకర్ల సమావేశంలో డీసీపీ సత్యనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం మహ్మద్ అవేజ్ అలియాస్ ఓవేస్ పటేల్(19), మీర్జా ఉమర్ అలీ బేగ్ అలియాస్ ఉమర్ (20), వసీం ఖాన్ అలియాస్ డాలర్ వసీం(31), మీర్జా నిసారుల్లా బేగ్ అలియాస్ సుల్తాన్(22), మహ్మద్ అబ్దుల్ కవి అలియాస్ ఒబేద్ (21), మహ్మద్ సులేమానుద్దీన్ అలియాస్ సులేమాన్ (19), ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్ అలియాస్ ఇర్ఫాన్ పఠాన్(22), మరో ఇద్దరు మైనర్లతో పాటు మృతుడు నబీల్ మహ్మద్(17) స్నేహితులు. ఈ నెల 3న ఉదయం 5 గంటల సమయంలో పంజెషాలోని ఇండో అమెరికల్ స్కూల్ వద్దకు చేరుకున్న స్నేహితులంతా తమలో ఎవరు పహిల్వానో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. స్ట్రీట్ ఫైట్‌కు ఉమర్ బేగ్ పర్యవేక్షకుడిగా వ్యవహరించగా, డాలర్ వసీం అంఫైరింగ్ చేయగా, పోరాట దృశ్యాలను ఒబేద్ సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఓవేస్‌తో ఫైట్‌కు నబీల్ను స్నేహితులు ప్రోత్సహించడంతో ఇద్దరు ఫైట్ ప్రారంభించా రు. ఓవేస్ ముష్టిఘాతాలకు దిగడంతో నబీల్ కుప్పకూలాడు. బైక్ ఫీట్ చేస్తుండగా కింద పడ్డాడని చెప్పాలంటూ ఉమర్ బేగ్ స్నేహితులందరిని ఒప్పించినబీల్ను స్థానికంగా ఉన్న దుర్రు షెహవార్ ఆస్పత్రికి తరలించారు. నబీల్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలపడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. బైక్ ఫీట్ చేస్తూ చనిపోయాడని ఫిర్యాదు చేస్తే పోస్ట్‌మార్టం నిర్వహిస్తారని, మైనర్ అయిన నబీల్ బైక్ నడిపినందుకు తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేస్తారని స్నేహితులంతా నబీల్ తండ్రి దస్తగిర్‌ను నమ్మించారు. దీంతో 4న నబీల్ మృతదేహానికి బార్కాస్‌లోని బడా శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడి ఒంటిపై గాయాలు లేకపోవడంతో అనుమానించిన దస్తగిర్ స్నేహితులను పిలిచి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలిచ్చారు. దీంతో దస్తగిర్ 7న మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెట్లో ఫైట్ వీడియోను అప్లోడ్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. తల, మెడపై బలమైన గాయాలు తగలడం వల్లే నబీల్ మృతిచెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా నబీల్ తన సోదరి ఫ్రెండైన ఓ యువతితో చాట్ చేయడం నిజమే అయినా, ఈ ఘటనకు దానికి సంబంధం లేదని డీసీపీ తెలిపారు. కాగా నిందితుల్లో ఒకరిద్దరి తల్లిదండ్రులకు విషయం తెలిసినా బయటకు చెప్పలేదని, వారినీ అరెస్ట్ చేస్తామన్నారు. -
ఖరీఫ్ దిగుబడి లక్ష్యం 12.50 లక్షల టన్నులు
తాడేపల్లిగూడెం రూరల్ :ఖరీఫ్‌లో జిల్లాలోని 2.38 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తారని అంచనా వేసినట్టు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు వి.సత్యనారాయణ చెప్పారు. తాడేపల్లిగూడెం వ్యవసాయ సహాయ సంచాలకుని కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఖరీఫ్‌లో 12.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలిపారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధంగా ఉన్నాయన్నారు. విత్తనాలను ఏపీ సీడ్స్, 9 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి సేకరించినట్టు తెలిపారు. ఏపీ సీడ్స్ ద్వారా 10 వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరించగా వీటిలో స్వర్ణ, 1010, 1001, 1061 వంగడాలు ఉన్నాయన్నారు. సీడ్ వీలేజ్ ప్రోగ్రామ్ ద్వారా 20 వేల క్వింటాళ్లు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 35 వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరించామని చెప్పారు. 2.17 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఈ ఖరీఫ్ సీజన్‌కు జిల్లాకు 2.17 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశామని జేడీ పేర్కొన్నారు. 40 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీటిని మార్క్‌ఫెడ్ గోదాముల్లో, సొసైటీల్లో ఉంచామని చెప్పారు. ఎరువులను సబ్సిడీపై రైతులకు అందిస్తున్నట్టు తెలిపారు. ఎరువులను పంటలకు మాత్రమే ఉపయోగించాలని, చేపల చెరువులకు తరలించడం వంటివి చేసే రైతులపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు కాకుండా ఇతరులకు విక్రయించిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాకు కేటాయించిన ఎరువులను పక్క జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తే లెసైన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. దీనిపై రైతులు నిఘాపెట్టి అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఖరీఫ్‌కు ముందస్తు నారుమళ్లు వేసుకోవాలి ఈ ఖరీఫ్‌కు ముందస్తు నారుమళ్లు వేసుకునేందుకు రైతులు సన్నద్ధం కావాలని జేడీ రైతులకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ తరువాత కాలువల ఆధునికీకరణ పనులను పునః ప్రారంభించనున్న దృష్ట్యా రైతులు పంట ముందుగా చేతికి వచ్చేలా సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. ఆధునికీకరణ పనులు జరిగే ప్రాంతాల్లో రబీలో ఆరుతడి పంటలకుగాను రైతులను ముందునుంచే సన్నద్ధం చేస్తున్నట్టు వివరించారు.తాడేపల్లిగూడెం ఏడీఏ పీజీ బుజ్జిబాబు, కోట రామచంద్రపురం ఏడీఏ కమలాకరశర్మ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీ వద్దన్నందుకు కడతేర్చారు..
= కాపలాదారుడిని హతమార్చింది స్నేహితులే == కీలక ఆధారాల్ని ఇచ్చిన సీసీ కెమెరా ఫుటేజ్ = ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు సాక్షి,సిటీబ్యూరో: పంజగుట్టలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీ కాపలాదారుడు రాజరెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. అతడు పనిచేస్తున్న కళాశాలలోనే స్నేహితులు చోరీ చేయడానికి ఉపక్రమించగా అడ్డుకున్నందుకే హతమార్చారని తేలింది. హత్యకు ఒడిగట్టిన ముగ్గురు నిందితుల్నీ మంగళవారం అరెస్టు చేశామని వెస్ట్‌జోన్ డీసీపీ వి.సత్యనారాయణ ప్రకటించారు. అదనపు డీసీ పీ నాగరాజు, పంజగుట్ట ఏసీపీ వెంకటనర్సయ్యలతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. ప్రైవేట్ కళాశాలలో కాపలాదారుడిగా పనిచేసిన రాజరెడ్డి, గతంలో ఇదే కాలేజీకి సెక్యూరి టీగార్డుగా పనిచేసిన అమీర్‌పేటలో నివసించే కర్నె కృష్ణ (ప్రింటింగ్ ప్రెస్‌కార్మికుడు), శ్రీనగర్‌కాలనీవాసి శ్రీనివాస్‌యాదవ్, పంజగుట్టకు చెందిన ఎం.యాదయ్యలు స్నేహితులు. వీరు ప్రతినిత్యం ఆ కళాశాల వద్దే కలుసుకునే వారు. అంతాకలిసి ఏదొక ప్రాంతంలో మద్యం సేవించేవారు. ఎవరి వద్ద నగదు ఉంటే ఆ రోజు కు వారు ఖర్చు పెట్టేవారు. ఈనెల 15న సాయంత్రం కూడా ఈ నలుగురూ కాలే జీ ఎదుటున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద కలుసుకొని..శ్రీనివాస్‌యాదవ్ మద్యం తాగేందుకు రూ.50 ఇవ్వాల్సింది గా రాజరెడ్డిని కోరాడు. అతడు నిరాకరిం చడంతో ఘర్షణకు దిగి బలవంతంగా లా క్కున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వా దం జరిగింది. రెచ్చిపోయిన శ్రీనివాస్ ‘నిన్ను చంపేస్తా’ అంటూ రాజరెడ్డిని హెచ్చరించాడు. రాజరెడ్డి కాలేజీలోకి వెళ్లిపోగా...మిగిలిన ముగ్గురూ కొంతసేపు గడిపారు. ఇక్కడే పథకం పన్నారు..: కర్నె కృష్ణ గతంలో రాజరెడ్డి పనిచేస్తున్న కాలేజీలోనే సెక్యూరిటీగార్డుగా పనిచేయడంతో రెం డో అంతస్తులోని గదిలో నగదు ఉంటుందని గుర్తుకొచ్చింది. దీంతో విషయాన్ని మిగిలిన ఇద్దరికి చెప్పాడు. రాజరెడ్డిని ఫూటుగా మద్యం తాగించి ఆ తర్వాత చోరీ చేయాలనుకున్నారు. ఇలా నలుగురు కలిసి రెండో అంతస్తులోని గదిలోకి వెళ్లి తాగడం మొదలుపెట్టారు. రాజరెడ్డి మాత్రం కేవలం కొద్ది పరిమాణంలోనే తాగి తనకు వద్దనడంతో కథ అడ్డం తిరిగింది. అతడు నిద్రపోతాడని చాలాసేపు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో తమ పథకాన్ని బయటపెట్టారు. తాను సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న కాలేజీలో చోరీ చేయొద్దని సూచించాడు. ఇది మింగుడుపడని శ్రీనివాస్ ఆగ్రహంతో రాజరెడ్డి మెడబిగించి అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేశాడు. మిగిలిన ఇద్దరు రైటింగ్‌ప్యాడ్‌తో రాజరెడ్డి తలపై మోదారు. రాజరెడ్డి చనిపోయాడని నిర్ధారించుకున్న ముగ్గురూ గదిలో ఉన్న రూ.45,800 నగదు, ఇతర ఉపకరణాలు తీసుకొని ఉడాయించారు. హత్య నేపథ్యంలో రంగంలోకి దిగిన పంజగుట్ట సీఐ తిరుపతిరావు తన బృందంతో దర్యాప్తు ప్రారంభించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పైనవున్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను అధ్యయనం చేశారు. ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసు లు, చూసిన కాలేజీ యాజమాన్యం తొలుత కర్నె కృష్ణను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతను మిగిలిన ఇద్దరి పేర్లు బయటపెట్టగా..శ్రీనివాస్,యాదయ్యల్ని పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.