ఘజియాబాద్: కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో నేరాలు చాలా వరకు తగ్గిపోయాయి. అంతకుముందుతో పోలిస్తే చోరీలు, హత్యలు, ఇతర నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ అక్కడక్కడ చోరశిఖామణులు పంజా విసురుతూనే ఉన్నారు. ప్రపంచమంతా విపత్కర పరిస్థితుల్లో ఉన్నా కొంతమంది చోరులు మాత్రం తమ చేతికి పనిచెబుతూనే ఉన్నారు. (ఆ ఐదు రాష్ట్రాల్లో కరోనా లేదు: కేంద్రం)
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోరీ చేస్తూ ఓ దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. స్థానిక గిరి మార్కెట్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సరుకులు కొనేందుకు ఓ పెద్దాయన స్కూటర్ మీద దుకాణానికి వచ్చాడు. బండిని దుకాణం ఎదుటే పార్కింగ్ చేసి సరుకులు కొనడానికి వెళ్లాడు. ఆయన వెనుకే తాపీగా వచ్చిన చోరుడు అదును చూసి బండితో అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ తతంగమంతా అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయింది. దీని ఆధారంగా దొంగను పట్టుకునేందుకు యూపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దొంగ తన పని తాను చేసినట్టుగానే సీసీ టీవీ కూడా చేసిందని ఈ వీడియో చూసినవాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment