
లక్నో: కరోనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి 20 మందికి విందు ఏర్పాటు చేసిన ఓ మహిళ (54)ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమెకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో కలకలం రేగింది. వివరాలు.. లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా మహిళ బహ్రెయిచ్ నుంచి ఘజియాబాద్ వెళ్లారు. గులాం అలీ పురాలోని తన నివాసంలో వారం క్రితం 20 మందికి విందు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని.. కోవిడ్ టెస్టు చేయించగా.. పాజిటివ్ వచ్చింది. ఆమె ఇంటిని, గులాం అలీ పురా ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. పార్టీలో పాల్గొన్నవారి వివరాలు సేకరిస్తున్నామని ఎస్పీ విపిన్ మిశ్రా వెల్లడించారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా 1604 కరోనా కేసులు నమోదు కాగా.. 24 మంది మృతి చెందారు. 206 మంది కోలుకున్నారు.
(చదవండి: నెమ్మదించిన మహమ్మారి!)
Comments
Please login to add a commentAdd a comment