నల్లగొండ: నల్లగొండ జిల్లా పెద్దఉర మండలం పులిచెర్ల గ్రామంలో నాలుగు సంవత్సరాల బాలుడు ఆదివారం సాయంత్రం 3.25 గంటలకు బోరుబావిలో పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న బోరు గుంతలో పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 20 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్టు, అతని అరుపులు వినిపిస్తున్నట్టు తల్లిదండ్రులు చెప్పారు.
విషయం అధికారులకు తెలియడంతో చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.