సియోల్(దక్షిణ కొరియా): బేబీ ఇన్స్టాగ్రామ్ స్టార్స్.. సియోల్ ఫ్యాషన్ వీక్లో అదరగొట్టారు. ఫ్యాషన్ షోల్లో మీకంటే మేమేం తక్కువ కాదంటూ చిన్నారులు ఇరగదీశారు. వివిధ రకాల టోపీలు..కళ్లద్దాలు పెట్టుకొని, చేతిలో కూల్ డ్రింక్స్, తినుబండారాలతో, మందం చొక్కాలు(జాకెట్లు), రకరకాల షూలు ధరించి అక్కడున్న వారందరిని ఆకర్షించారు.
చిన్ని చిన్ని నడకతో చిట్టిపొట్టి మాటలతో హుషారుగా ఉండే బుడతలు స్టైలీ లుక్స్తో ఫోటోలకి ఫోజు ఇచ్చి వీక్షకుల మనసులు దోచేశారు.