మునగాల(నల్లగొండ): స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నారులు ఆటోలో మునగాల పాఠశాలకు వెళ్లి వస్తూ ఉంటారు.
ఈ క్రమంలో బుధవారం తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో గ్రామ శివారులోకి రాగానే ఆటో ముందు టైరు పేలిపోయింది. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలోఅశ్విని అనే రెండో తరగతి విద్యార్థిని మృతిచెందగా, మరో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
స్కూల్ ఆటో బోల్తా.. చిన్నారి మృతి
Published Wed, Jan 20 2016 7:52 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement