స్కూల్ విద్యార్థినులు కిడ్నాప్‌కు దిగితే..
న్యూయార్క్: అమెరికాలో ఇద్దరు విద్యార్థునిలు కిడ్నాప్కు పాల్పడ్డారు. ఓ స్టోర్ వద్ద నుంచి రెండేళ్ల పాపను ఎత్తుకెళ్లారు. కిడ్నాప్ కు పాల్పడిన ఇద్దరు కూడా 13, 14 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. న్యూక్యాజిల్ సిటీలోని ప్రిమార్క్ స్టోర్లో నుంచి పాపను తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ పాపకు సంబంధించిన వాళ్లు షాపింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే, ఈ ఘటన జరిగిన 45 నిమిషాల్లోనే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు విద్యార్థినులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వారిని నార్త్ షీల్డ్లోని కోర్టులో హాజరుపరిచారు. ఆ పాపను తన తల్లివద్దకు చేర్చారు. లైంగిక చర్యలకు పాల్పడాలనే ఉద్దేశంతోనే ఆ రెండేళ్ల పాపను కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపించిన పోలీసులు వారిపై కిడ్నాప్ ఆరోపణలు నమోదు చేశారు. అయితే, వారు విద్యార్థినులు అయినందున కిడ్నాపేతర అభియోగాలకోసం పిటిషన్ దాఖలు చేయగా అందుకు ప్రాసిక్యూషన్ అనుమతించింది. పాపను కిడ్నాప్ చేయడంతోపాటు అదే షాపింగ్ మాల్ లో వారు షూలు, పాలడబ్బాలు ఎత్తుకెళ్లినట్లు కూడా అభియోగాలు ఉన్నాయి. ఇలా చేయడం వారికి ఇది మూడోసారి.