ఫోన్‌ నాది.. కాదు నాది ఇచ్చేయ్‌: వైరలవుతోన్న క్యూట్‌ వీడియో | Monkey and Toddler Snatch Phones From Each Other In Viral Video | Sakshi
Sakshi News home page

ఫోన్‌ నాది.. కాదు నాది ఇచ్చేయ్‌: వైరలవుతోన్న క్యూట్‌ వీడియో

Published Thu, Nov 11 2021 8:08 PM | Last Updated on Thu, Nov 11 2021 8:16 PM

Monkey and Toddler Snatch Phones From Each Other In Viral Video - Sakshi

కోతి చేష్టలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. అవి చేసే తింగరి పనులు అదరిని నవ్విస్తుంటాయి. ఇంటి ఆవరణలో, పైన ఏ వస్తువులు కనిపించిన వాటిని చెల్లాచెదురుగా పడవేస్తాయి. ఇక వాటికి ఏమైనా దొరికితే వాటిని పట్టుకొని నానా హంగామా సృష్టిస్తాయి. ఇక కోతులు డబ్బులు, ఫోన్లను పట్టుకొని పారిపోయిన సంఘటనలు చాలానే చూశాం. తాజాగా  ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి వైరల్‌గా మారింది. 
చదవండి: హ్యాట్సాఫ్‌ మేడమ్‌!.. యువకుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీస్‌

ఈ వీడియోలో ఒక మంచంపై చిన్నారి మొబైల్‌తో ఆడుకుంటుంది. అక్కడికి వచ్చిన కోతి పాప పక్కనే కూర్చుంటుంది. వెంటనే చిన్నారి చేతిలోని ఫోన్‌కు లాక్కొని దాన్ని పరీక్షించి చూస్తుంది. కొద్దిసేపు  కోతిని పరీక్షించిన చిన్నారి ఆ ఫోన్‌ను తిరిగి లాక్కుంటుంది. వెంటనే మళ్లీ పాప దగ్గరి నుంచి కోతి ఫోన్‌ లాక్కుంటుంది. ఇలా ఈ వీడియో చూస్తుంటే మొబైల్‌ నాదంటే నాది అని లాక్కుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింటా వైరలవుతూ నెజిజన్లను నవ్విస్తోంది. 
చదవండి: అద్భుతమైన ఫోటో.. రాష్ట్రపతిని ఆశీర్వదించిన 102 ఏళ్ల టీచర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement