తమ్ముడికి అన్న ట్రైనింగ్: వైరల్ వీడియో
ఇద్దరు చిన్నారుల వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. డైలీ బంప్స్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఆ వీడియోను సుమారు 4 కోట్ల మంది వీక్షించారు. అంతలా హల్‌చల్ చేస్తున్న ఆ వీడియోలో ఏముందంటే.. ఓ అన్న తన తమ్ముడికి జైలు లాంటి బెడ్ నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతుంది.
ఆటలాడే సమయం అయిపోయిందంటూ ఇద్దరు పిల్లలు ఒలివర్, ఫిన్‌లను తల్లిదండ్రులు బెడ్ ఎక్కించేశారు. అయితే.. ఇంకా కలిసి ఆడుకోవాలని అనుకున్నారో ఏమో ఆ పిల్లలు అందుకోసం పెద్ద సాహసమే చేశారు. ఒలివర్ తన తమ్ముడికి బెడ్ నుంచి ఎలా బయటపడాలో పెద్ద డెమాన్‌స్ట్రేషన్‌తో చూపించి.. ఎట్టకేలకు తన తమ్ముడికి విముక్తి కల్పిస్తాడు. అంతేనా.. 'యూ కెన్ డూ ఇట్' అంటూ తమ్ముడిని ఒలివర్ ఎంకరేజ్ చేసిన విధానంపై నెటిజన్‌లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.