షాకింగ్‌ వీడియో.. పిల్లాడి నోట బీరు సీసా! | Government asks people to identify man feeding toddler alcohol in viral video | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో.. పిల్లాడి నోట బీరు సీసా!

Published Wed, Aug 3 2016 8:29 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

షాకింగ్‌ వీడియో.. పిల్లాడి నోట బీరు సీసా!

షాకింగ్‌ వీడియో.. పిల్లాడి నోట బీరు సీసా!

పాలబుగ్గుల చిన్నారికి ఎవరైనా పాలు తాగిస్తారు.. కానీ ఓ వ్యక్తి మాత్రం పసిపిల్లాడి నోట్లో బీరు సీసా పెట్టాడు. ఆ చిన్నారికి బ్రాండి సీసా కూడా ఇచ్చాడు. ఏమీ తెలియని ఆ చిన్నారి ఆ సీసాలను నోట్లో పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ చిన్నారికి ఏకంగా బీరు తాగించాడు. ఇది పెద్ద ఘనకార్యం అయినట్టు కూడా వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

పారేడే చిన్నారికి మద్యం తాగించడమేమిటని పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా స్పందించింది. ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి మీకు ఎవరికైనా తెలిసి వుంటే ఆ సమాచారాన్ని తమ ఈమెయిల్‌ ఐడీ (min-wcd@nic.in)కి పంపాలని కోరింది. సరదా కోసమైనా చిన్నారులతో ఇలాంటి వికృతమైన ఫీట్లు చేయించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement