వరంగల్: వరంగల్ జిల్లా ములుగు మండల కేంద్రంలో బుధవారం ఉదయం స్కూలు వ్యాను ఢీకొన్న ఘటనలో చిన్నారి కాలు పోగొట్టుకుంది. మండల కేంద్రం హన్మాన్‌బస్తీకి చెందిన ఓదెలు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె హనీ(3) బుధవారం ఉదయం రోడ్డు పక్కన ఉండగా స్థానిక ప్రైవేట్ స్కూలు బస్సు అటుగా వెళుతోంది. ప్రమాదవశాత్తు బస్సు తాకటంతో చిన్నారి కాలు పూర్తిగా నుజ్జయింది. దీంతో ఆమెను ములుగు ఆస్పత్రికి, అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనకు కారకుడైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని, బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాఠశాల వాహనాల్లో చిన్నారులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలంటూ అధికారులు అవగాహన కల్పించిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.