ఆదిలాబాద్: ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన ఓ బాలుడిని స్కూలు బస్సు చిదిమేసింది. బుధవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా భీమిని మండలం జనకాంపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లాకు చెందిన సంగ భూమేశ్, మౌనిక దంపతులు బతుకుదెరువు కోసం జనకాపూర్ గ్రామానికి వలస వచ్చారు. గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. చిన్న వాడైన అభిలాష్(4) ఇంటి వద్ద ఉంటున్నాడు.
బుధవారం సాయంత్రం ఆడుకుంటూ రోడ్డు పైకి వచ్చిన అతడిని భీమినికి చెందిన ఓ స్కూలు బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో అభిలాష్ అక్కడికక్కడే మృతి చెందాడు.