ప్రకాశం(కంభం): ఏడేళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం ప్రకాశం జిల్ల్లా కంభం మండలంలో వెలుగుచూసింది. మండలంలోని రాయపాడు గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... అదే గ్రామానికి చెందిన పోలిక వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు బుధవారం సాయంత్రం చిన్నారిని గ్రామ శివారుకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసి చంపేందుకు యత్నించాడు. బాలిక కనిపించకపోవడంతో కుటంబ సభ్యులు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే అర్ధరాత్రి తర్వాత బాలికను తీసుకుని వెంకటేశ్వర్లు గ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సదరు వ్యక్తిని చితక బాది పోలీసులకు అప్పగించారు.