కోయిలకుంట్ల(కర్నూలు): ఆర్టీసీబస్సు కిందపడి కీర్తన అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన కోయిలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక్కసారిగా చిన్నారి రోడ్డుపైకి రావడం..అదే సమయంలో ఆర్టీసీ బస్సు వేగంగా రావడం..బస్సు కింద పడి నుజ్జునుజ్జవటం ఒక్కసారిగా జరిగిపోయాయి.
ఘటన అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని కోయిలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.