
షాపింగ్ మాల్ సంచలన వీడియో
షాపింగ్ మాల్స్, పెద్దపెద్ద స్టోర్లలో కస్టమర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో.. లేదా.. కస్టమర్లను ఇబ్బంది పెట్టే స్టోర్ల తీరును వెల్లడించే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కస్టమర్ది తప్పంటే, ఇంకొందరు షాప్ ఓనర్లదే తప్పంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది?
షాపింగ్ మాల్స్ కు వెళ్లినప్పుడు పొరపాటున మన చెయ్యో, కాలో తగిలి హ్యాంగర్లకుండే దుస్తులో, తేలికపాటి వస్తువులో కిందపడితే ఏం చేస్తాం? అక్కడ బాయ్/గర్ల్ ఉంటే గనుక చిన్నగా నవ్వి 'సారీ' అన్నట్లు చూస్తాం. అదే ఖరీదైన వస్తువును పడేశామనుకోండి.. అప్పుడెలా? బ్రిటన్లో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో బాగా పేరున్న హెచ్బీహెచ్ సంస్థకు అక్కడ లెక్కకు మిక్కిలి స్టోర్లున్నాయి. వాటిలో ఒకదాంట్లో చోటుచేసుకున్న సంఘటన తాలూకు వీడియోను ఆ కంపెనీయే అక్టోబర్ 13న యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు 31 లక్షల మంది ఈ వీడియోను చూశారు. కస్టమర్ పొరపాటు వల్ల ఒక్కోటీ రూ.4 లక్షలు విలువ చేసే నాలుగు టీవీలు బద్దలయ్యాయి. ఒక్క 'సారీ'తో మాఫీ అయ్యే పొరపాటు కానందున నష్టంలో కస్టమర్ వాటాను కూడా వసూలు చేసిందట ఆ కంపెనీ. మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా?