సామాజిక సేవలో టాటా మోటార్స్
Published Wed, Nov 23 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
కర్నూలు (టౌన్) ; టాటా మోటార్స్ సంస్థ తమ వంతుగా సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆ సంస్థ ఏరియా మేనేజర్ మీర్జా దావుద్ బేగ్ పేర్కొన్నారు. మంగళవారం టాటా మోటార్స్ ఆధీకృత డీలర్ మేరు ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో స్థానిక సస్య ప్రైడ్ హోటల్ సమావేశ హాలులో టాటా డిలైట్ కస్టమర్ల పిల్లలకు స్కాలర్ షిప్పులు పంపిణీ చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించి పది, ఇంటర్‌లో 75 శాతంపైగా మార్కులు సాధించిన విదా్యర్థినులకు ప్రశంసాపత్రం, రూ. 25 వేలు నగదును చెక్కు రూపంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఏరియా మేనేజర్ మాట్లాడుతూ టాటా కస్టమర్ల కోసం 2011 సంవత్సరం నుంచి ఇటువంటి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. టాటా డిలైట్ కార్డు కలిగిన డ్రైవర్లకు ప్రమాదం జరిగితే రూ. 2.45 లక్షలు నుంచి రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. అలాగే ఆసుపత్రి ఖర్చుల కింద రూ. 30 వేల నుంచి రూ. 50 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేరు ఆటోమొబైల్స్ సీఈఓ జయరాం, సంస్థ మేనేజర్లు, సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement