వైన్ షాపు యజమాని దాష్టీకం | wine shop owner tapping to customer with beer bottle in nalgonda district | Sakshi

వైన్ షాపు యజమాని దాష్టీకం

Published Thu, Dec 24 2015 3:07 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

wine shop owner tapping to customer with beer bottle in nalgonda district

మిర్యాలగూడ: మద్యం కొనుగోలు చేసిన అనంతరం తనకు రావాల్సిన డబ్బులు అడిగిన వ్యక్తిపై వైన్ షాపు యజమాని మద్యం బాటిల్‌తో దాడి చేయడంతో.. బాధితుడి తలకు బలమైన గాయమైంది. దీంతో స్థానికులు వైన్ షాప్ యజమాని తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.

తిమ్మాపురంకు చెందిన రమావత్ మంతు(35) మద్యం కొనుగోలు చేయడానికి బస్టాండ్ సమీపంలోని ఓ వైన్స్ షాపుకు వెళ్లాడు. రూ. 200 ఇచ్చి ఒక బీరు కొనుగోలు చేశాడు. అనంతరం తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన వైన్స్ యజమాని అదే బీరు బాటిల్‌తో తలపై బలంగా కొట్టాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement