ముంబై: సెక్యూరిటైజేషన్ పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) 48 శాతం పెరిగి రూ.75,000 కోట్లకు చేరుకున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఇన్వెస్టర్లు (బ్యాంకులు/ఆర్థిక సంస్థలు) రిటైల్ రుణాల పట్ల నమ్మకం చూపించడం ఈ వృద్ధికి కారణమని పేర్కొంది. సెక్యూరిటైజేషన్ అంటే ఒక రుణదాత ఒక రుణంపై భవిష్యత్తులో తనకు వసూలు కావాల్సిన మొత్తాలను కొంత తక్కువకు వేరే రుణదాతకు విక్రయించడం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కరోనా రెండో విడత వల్ల సెక్యూరిటైజేషన్ మార్కెట్ ప్రతికూలతలను చూసి నట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది.
అయతే, ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులకు కొంత వెనుకాడడం వల్ల కొన్ని డీల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సం తొలి అర్ధభాగంలో పూర్తి కాలేదని వెల్లడించింది. మార్ట్‌గేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ రుణాలు అతిపెద్ద వాటా కలిగి ఉన్నాయి. మార్కెట్ పరిమాణంలో 40%గా ఉన్నాయి. దీని తర్వాత వాణిజ్య వాహన రుణాలు 30%, సూక్ష్మ రుణాల వాటా 13% చొప్పున ఉంది. మార్ట్‌గేజ్, బంగారం, సూక్ష్మరుణాల వాటా కలిపి 62 శాతంగా ఉంది. పాస్ త్రూ సర్టిఫికెట్ల (పీటీసీలు) వాటా ఏడాది క్రితం ఇదే కాలంలో ఉన్న 44 శాతం నుంచి 38 శాతానికి తగ్గింది. సెక్యూరిటైజేషన్ మార్కెట్లో సగం మేర రుణాలను ప్రైవేటు బ్యాంకులు సొంతం చేసుకున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు పావు వంతు కొనుగోలు చేశాయి.
చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన
Comments
Please login to add a commentAdd a comment