ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వస్తువులు కొన్ని సందర్భాల్లో మారిపోతూ ఉంటాయి. ఒక వస్తువు బుక్ చేస్తే.. మరో వస్తువు డెలివరీ అయిన సందర్భాలు చాలానే వున్నాయి. ఇటీవల కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, గబ్బర్ సింగ్ అనే వ్యక్తి అమెజాన్‌లో ఒక ఐఫోన్ 15 ఆర్డర్ చేశారు. అయితే అతనికి డెలివరీ అయిన ఫోన్‌ను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే అతనికి వచ్చిన ఫోన్ నకిలీది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.
వావ్ అమెజాన్ ఇన్.. ఒక నకిలీ ఐఫోన్ 15ని డెలివరీ చేసింది. బాక్స్‌లో కేబుల్ కూడా లేదు. మొత్తం డబ్బా, ఇలాంటి సమస్యను ఎవరైనా ఎదుర్కొన్నారా? అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ రెస్పాండ్ అవుతున్నారు.
ఈ సంఘటనపైన అమెజాన్ స్పందించి ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి, ఆర్డర్ వివరాలను తెలియజేస్తే.. 6 నుంచి 12 గంటల్లో మీకు తప్పకుండా సహాయం చేస్తామని వెల్లడించింది. ఐఫోన్ కోసం వెచ్చించిన మొత్తాన్ని రీఫండ్ చేయమని బాధితుడు అమెజాన్‌ను కోరారు.
ఇదీ చదవండి: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే?
Waah @amazonIN delivered a Fake iPhone 15. Seller is Appario. Tagged with “Amazon choice” No cable in the box. Total Dabba. Has anyone faced similar issue? pic.twitter.com/QjUqR7dKSU
— Gabbar (@GabbbarSingh) February 23, 2024
Comments
Please login to add a commentAdd a comment