ముంబై : తన మెయిల్‌కు వచ్చిన కస్టమర్ల ఫిర్యాదులకు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కచ్చితంగా స్పందించటమే కాకుండా వాటి పరిష్కారానికి మార్గం చూపుతారన్న సంగతి మరోసారి రూఢీ అయింది. తాజాగా ముంబై వ్యక్తి ఫిర్యాదుకు జెఫ్ స్పందించారు. సదరు వ్యక్తికి న్యాయం జరిగేలా చూశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓంకార్ హన్‌మంతే కొద్దిరోజుల క్రితం తన బామ్మ కోసం అమెజాన్ సైట్‌లో ఓ సెల్ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. అయితే సెల్‌ఫోన్ ప్యాకేజ్‌ను ఓంకార్‌కు అందించాల్సిన డెలివరీ బాయ్ అతడు నివాసం ఉంటున్న భవన సముదాయం గేట్ వద్ద ఉంచి వెళ్లాడు. ఈ నేపథ్యంలో దాన్ని ఓ దొంగ ఎత్తుకెళ్లిపోయాడు. సీసీటీవీ రికార్డు ద్వారా సెల్‌ఫోన్ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ( బిహార్ మంత్రిని ఏకిపారేస్తున్న నెటిజన్లు )
దీంతో ఆగ్రహానికి గురైన ఓంకార్ అమెజాన్ కస్టమర్ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. డెలివరీ బాయ్‌ల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశాడు. అక్కడ కూడా సరైన స్పందన రాకపోయే సరికి ఏకంగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్‌కు ఈ సంగతుల్ని మెయిల్ పంపాడు. అతడి మెయిల్‌ను చదివిన జెఫ్.. ఇన్‌ఛార్జ్ ఎగ్జిక్యూటివ్‌కు ఈ విషయాని చెప్పి, సమస్యను పరిష్కరించమని ఆదేశించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఇన్‌ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఓంకార్‌కు ఫోన్ చేశాడు. ఆధారాలను పరిశీలించి, సరైన అడ్రస్‌కు సెల్‌ఫోన్‌ను పంపించేశాడు.
Comments
Please login to add a commentAdd a comment