ఇంట్లో ఎన్ని వెరైటీ వంటకాలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు రెస్టారెంట్లలో పుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాం. టెక్నాలజీ పుణమ్యా అని ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లు రాకతో చేతిలో మొబైల్ ఉంటే చాలు నచ్చిన పుడ్ ఇంటి దగ్గరకే డోర్ డెలివరీ అవుతున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఇందులో మరో కోణం కూడా దాగుంది. వివిధ కారణాలతో డెలివరీ ఏజెంట్లు కస్టమర్లు ఆర్డర్ పెట్టిన ఆహారాన్ని అందివ్వడంతో విఫలమవుతున్నారు. అలా జరిగినప్పుడు, వారు తరచుగా సాకులు చెబుతారు. మరో విషయం ఏమిటంటే.. కొన్ని సందర్భాల్లో డెలివరీ ఏజెంట్లు కస్టమర్ల ఆహారాన్ని స్వయంగా తింటున్నారు కూడా. తాజాగా ఈ తరహా ఘటనే సోషల్‌మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన పిల్లల కోసం ఆన్‌లైన్‌లో పుడ్ ఆర్డర్ పెట్టి ఎదురుచూస్తుంటాడు. డెలివరీ సమయం సమీపిస్తున్న ఆహారం రాకపోవడంతో డెలివరీ ఏజెంట్‌కి ఈ విషయమై మెసేజ్ చేస్తాడు. ఆ సంభాషణలో.. సారీ బ్రదర్ మీరు ఆర్డర్ పెట్టిన ఫుడ్‌ని నేనే తిన్నట్లు కస్టమర్‌కు మెసేజ్ చేస్తాడు. దీంతో రూల్స్ ఉల్లంఘించినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తారని ఏజెంట్‌కు కస్టమర్ మెసేజ్ చేశాడు. అందుకు ఏజెంట్ వెటకారంగా స్పందిస్తూ, "మీరు దానిని నిరూపించలేరు, మిత్రమా అంటూ బదులిచ్చాడు.
డెలివరీ ఏజెంట్ తమ హౌసింగ్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించలేదని నిరూపించడానికి తమ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఉన్నట్లు పేర్కొంటాడు కస్టమర్. అయితే, ఏజెంట్ కస్టమర్‌ను ఫుడ్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టావ్ ఇంత సోమరిగా ఉన్నావేంటి అని పిలవడంతో వీరి మధ్య సంభాషణ కాస్త సీరియస్‌గా మారింది. చివరిలో ఆ డెలివరీ ఏజెంట్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఆహారం అద్భుతంగా ఉందని, అతను ఆర్డర్ చేసిన ఆహారాన్ని తిన్నానని నిర్ధారిస్తూ సంభాషణను ముగించాడు. ప్రస్తుతం ఈ చాట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్నిచూసిన నెటిజన్లు డెలివరీ ఏజెంట్ చేసిన పనికి మండిపడుతున్నారు.
చదవండి: Video: ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన వరద బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment