న్యూఢిల్లీ: జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఫిర్యాదు చేశారు. బకెట్ గుర్తు ఉన్న నవరంగ్ పార్టీని పోటీ చేయొద్దని పవన్ కల్యాణ్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని షేక్ జలీల్ ఈసీని కోరారు. ఈసీకి ఫిర్యాదు ఇచ్చిన అనంతరం షేక్ జలీల్ మీడియాతో మాట్లాడారు.
‘ఎంపీ బాలశౌరి, నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఏపీ ఎన్నికలలో బకెట్ గుర్తు ఉన్న నా పార్టీని పోటీ చేయవద్దని పవన్ కల్యాణ్ బెదిరిస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి నాపై గన్ పెట్టి బెదిరించాడు. హత్యాప్రయత్నం చేశాడు. ఏపీలో ఈసీ నా పార్టీకి బకెట్ గుర్తు కేటాయించింది.
..జనసేన గాజు గ్లాసు గుర్తు, నా పార్టీ బకెట్ గుర్తు ఒకేలా ఉంటుంది. అందుకే నా పార్టీ పోటీ చేయవద్దని బెదిరిస్తున్నారు. రూ. 5 కోట్లు ఇస్తానని పవన్ కల్యాణ్ చెప్పాడు. అయినా వారి ప్రలోభాలకు లొంగలేదు. మేము లక్ష్మినారాయణ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్‌గా పోటీ చేస్తున్నాం. పవన్ కల్యాన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి’అని షేక్ జలీల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment