
సాక్షి, నల్గొండ: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్ వార్డులో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీనికి తోడు ఉన్న కొద్దిమంది సిబ్బందికి కనీసం పీపీఈ కిట్లు కూడా లేకపోవడంతో వారు చేతులెత్తేశారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కరోనా రోగులకు, వారి సహాయకులే సేవలు చేస్తున్నారు. అవగాహన రాహిత్యంతో మాస్కులు కూడా ధరించకుండానే రోగులతో దగ్గరగా ఉంటున్నారు. తమవారిని కాపాడుకోవాలని ఆరాటపడుతున్నారు. కాగా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఇటీవల ఇదే ఆస్పత్రిలో బొప్పని యాదయ్య అనే రోగి మృతి చెందడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ వైద్య శాఖకు చీవాట్లు పెట్టినా ఎలాంటి మార్పు కానరావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment