తమిళనాడు సర్కారుకు నోటీసులు
చెన్నై: అన్నదాత ఆత్మహత్యపై తమిళనాడు ప్రభుత్వం, ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్ హెచ్ ఆర్సీ) సోమవారం నోటీసులు జారీ చేసింది. పోలీసులు, ప్రైవేటు ఫైనాన్షియల్ కంపెనీ వేధింపులకు గురిచేయడంతో రైతు ఆత్మహత్య చేసుకున్న కేసులో నోటీసులిచ్చింది. రెండు వారాల్లోగా విరవరణ ఇవ్వాలని ఆదేశించింది.
అరియళూరు జిల్లాలో శుక్రవారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రుణం చెల్లించనందుకు ఫైనాన్స్ కంపెనీ అతడి ట్రాక్టర్ సీజ్ చేసింది. దీంతో మనస్తాపం చెందిన రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కొద్దిరోజుల క్రితం తంజావూరు జిల్లాలోనూ ఇలాంటి చర్య ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రూ.1.3 లక్ష రుణం తీసుకున్న రైతు అప్పు చెల్లించకపోవడంతో అతడిని పోలీసులు చితకబాదారు.