!['విద్యాకుసుమాలకు కులరంగులేంటి'](/styles/webp/s3/article_images/2017/09/3/71448534818_625x300.jpg.webp?itok=OH83WUTP)
'విద్యాకుసుమాలకు కులరంగులేంటి'
చెన్నై: తమిళనాడు విద్యాశాఖ అధికారులకు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. పాఠశాల విద్యార్థుల విషయంలో కుల వివక్షకు ఎలా దిగుతున్నారో తమకు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని పాఠశాలల్లో పాఠశాల విద్యార్థులు భిన్న రంగుల్లో వస్త్రాలు ధరిస్తున్నారు.
ఆయా రంగుల దుస్తుల ప్రకారం వారిది ఏ కులమో తెలుస్తుందట. ఈ విషయం ఆయా పత్రికల్లో కథనాలుగా వెలువడటంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ అంశాన్ని సీరియస్ గా భావించి సుమోటోగా స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ తమిళనాడులోని సంబంధిత శాఖలకు నోటీసులు జారీ చేసింది.