సాక్షి, చెన్నై : తమిళనాడు తిరునల్వేలి జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు తమపై దాడికి దిగిన దొంగలకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. దొంగలకు ఏ మాత్రం బెదరకుండా షణ్ముగవేల్, సెంతామరై దంపతులు పోరాడిన తీరు స్ఫూర్తి కలిగించేలా ఉంది. అయితే షణ్ముగవేల్ దంపతుల ధైర్యానికి మెచ్చుకుని తమిళనాడు ప్రభుత్వం వారికి సాహస పురస్కారం అందజేసింది. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గురువారం షణ్ముగవేల్ దంపతులకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ పురస్కారం ప్రధానం చేశారు. ఈ అవార్డు తీసుకోవడం కోసం షణ్ముగవేల్ దంపతులు బుధవారం సాయంత్రం చెన్నైకి చేరుకున్నారు. తిరునల్వేలి జిల్లా కలెక్టర్ శిల్ప ప్రభాకర్.. సాహస పురస్కారం కోసం ఈ వృద్ద దంపతుల పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు సమాచారం.
ఈ అవార్డు తీసుకున్న అనంతరం షణ్ముగవేల్ మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. తమ ఫిరాద్యుపై వేగంగా స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తాము నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తామని నమ్ముతున్నట్టు చెప్పారు.
దొంగలపై ప్రాణాలకు తెగించి ఆ వృద్ధ దంపతులు ప్రదర్శించిన సాహసంపై ఈ కింది లింక్ క్లిక్ చేయండి
చదవండి : దుండగులపై వృద్ధ దంపతుల ఎదురుదాడి!
Comments
Please login to add a commentAdd a comment